కర్నూలు జిల్లాలో దారుణం..ప్రార్థనల పేరిట బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులు..!

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో చర్చి పాస్టర్ అరాచకాలు బయటపడ్డాయి. ప్రార్థనల కోసం వచ్చిన మైనర్ బాలికలను పాస్టర్ ప్రసన్న కుమార్ లైంగికంగా వేధించాడు. చర్చిలో పిలిచి బాలికలపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జిల్లాలోని చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో ప్రసన్న కుమార్ ఓ చర్చికి పాస్టర్ గా ఉన్నాడు. సమీప ప్రాంతంలోని పెద్దలు పనికి వెళ్లినప్పుడు పాస్టర్ బాలికలను ప్రార్థనల పేరుతో చర్చిలోకి తీసుకెళ్లేవాడు. అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో పాస్టర్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గ్రామపెద్దలు రాజీ ప్రయత్నాలు చేశారు. రాజీ వ్యవహారంలో కొంత డబ్బులు చేతులు మారినట్లు సమాచారం.. 

అయితే చర్చి పాస్టర్ పై వచ్చిన ఆరోపణలను నిరూపించే వీడియోను కొందరు గ్రామస్తులు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ పాస్టర్ పైశాచికం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు పాస్టర్ ప్రసన్న కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

Leave a Comment