టీడీపీకి 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాజీనామా..!

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి భారీ షాక్ తగిలింది. క్రైస్తవ మతం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాజీనామా చేశారు. 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడిగా గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ టీడీపీలో ఎంతో కాలంగా ఉండి పార్టీ కోసం పని చేస్తన్నామని, చంద్రబాబు ఈనెల 5న చేసిన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని బాధించాయని చెప్పారు. 

క్రైస్తవ సమాజాన్ని అవమానించే విధంగా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఆయన ఎప్పుడూ ఇలాంటి మాటలు గతంలో‌ చేయలేదన్నారు. ఆ మాటలు.. క్రైస్తవులు మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. గతంలో మీరు అనేక సార్లు చర్చిలో చంద్రబాబు ప్రార్ధనలు కూడా చేయలేదా.. మసీదులకు వెళ్లి నమాజ్ చేసి శుభాకాంక్షలు చెప్పలేదా అని ప్రశ్నించారు. 

లౌకిక దేశంలో అన్ని మతాల వారు… అన్ని పండుగలలో పాల్గొంటారన్నారు. మత మార్పిడి విషయంలో కూడా క్రిస్టియన్ లను అవమానించారని, బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు.  గ్రామాలలో చర్చిలు ఎప్పటి నుంచో ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పడం సరికాదని వెల్లడించారు. 

 

Leave a Comment