టీమిండియాకు ‘చోకర్స్’ ముద్ర..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పదం చోకర్స్.. క్రికెట్ లో చోకర్స్ అంటే గుర్తొచ్చే దక్షిణాఫ్రికా జట్టు.. ఎందుకంటే ప్రతి టోర్నీలోనూ బాగా ఆడుతుంది. కానీ ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు వచ్చేసరికి చేతులెత్తేస్తుంది. ముఖ్యంగా లీగ్ దశల్లో బాగా ఆడి.. నాకౌంట్ దశకలో బోల్తా కొడుతుంది. విజయానికి చేరువగా వచ్చి ఓడిపోతుంది. 

అయితే అన్ని ఫార్మాట్లలో మేటి జట్లలో ఒకటిగా ఎదిగిన టీమిండియా ఇప్పుడు ‘చోకర్స్’ ముద్ర వేసుకుంటుంది. దక్షిణాఫ్రికా లాగా టీమిండియా కూడా లీగ్ దశల్లో బాగా ఆడి నాకౌట్ దశకు వచ్చే సరికి తుస్సుమనిపిస్తోంది. 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఇప్పటి వరకు ఒక్క మెగా టోర్నీ కూడా గెలవలేదు.. ఇలా వరుసగా ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టుపై బోల్తా కొడుతూ ‘నయా చోకర్స్’ అనిపించుకుంటోంది టీమిండియా…

2013 తర్వాత టీమిండియా ప్రదర్శనలు:

  • 2014లో టీ20 ప్రపంచ కప్ లో చక్కటి ప్రదర్శన చేసి ఫైనల్ కు చేరింది. టైటిల్ టీమిండియాదే అనుకున్నారు. కానీ ఫైనల్ లో టీమిండియా చేతులెత్తేసింది. శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. 
  • తర్వాత రెండేళ్లకు సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ లోనూ లీగ్ దశలో అదరగొట్టింది. సెమీస్ వరకు వచ్చింది. సెమీస్ లో భారీ స్కోర్ చేసి విజయం సాధిస్తామనే ధీమాగా ఉండింది. కానీ వెస్టిండ్ భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియాకు షాక్ ఇచ్చి ఫైనల్ కు చేరింది. 
  • 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా భారీ విజయాలతో ఫైనల్ చేరింది. అప్పటికే లీగ్ దశలో పాకిస్తాన్ ను ఓడించింది. కానీ ఫైనల్లో పాకిస్తాన్ టీమిండియాకు షాక్ ఇచ్చి కప్పు ఎగరేసుకుపోయింది. 
  • 2019లో వన్డే ప్రపంచకప్ లో తిరుగులేని విజయాలతో సెమీస్ కు చేరింది. సెమీస్ లోనూ న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. 
  • 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లోనూ భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. 

Leave a Comment