అసత్యాలు చెప్పొద్దు : చంద్రబాబు

మంగళగిరి : ప్రభుత్వం అంటే నమ్మకమని, అసత్యాలు చెప్పొద్దని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టాలను ఉల్లంఘించేది ప్రభుత్వమే కాదన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి..సంఘీభావం తెలుపుతున్నారని  వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ ఉండాలని, అమరావతిని ప్రారంభించడం తప్పా? అని ప్రశ్నించారు. 2015 ఏప్రిల్ 23న జీవో జారీ చేసి అమరావతిపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అదే విషయాన్ని నిన్న కేంద్రం చెప్పిందన్నారు. రాజధానిని నిర్ణయించడానికి.. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని కేంద్రం చెప్పింది కానీ.. రాజధానిని మార్చడానికి హక్కు ఉంటుందనలేదని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు పెట్టుకోమని కేంద్రం చెప్పలేదన్నారు. అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ తప్పు అని చెప్పిన నేతలు.. విశాఖలో పేదల అసైన్డ్‌ భూములు కొట్టేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Leave a Comment