నిహారికతో చిరు సెల్పీ..ఎమోషనల్ అయిన నాగబాబు..!

మెగాడాటర్ నిహారిక పెళ్లి రెండురోజుల్లో జరగనుంది. డిసెంబర్ 9న ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదిక నిహారిక – చైతన్యల వివాహం జరగబోతుంది. ఈక్రమంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగాయి. ఈ ఆదివారం నిహారికను పెళ్లి కూతురును చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తన సతీమణి సురేఖతో హాజరై నిహారికను ఆశీర్వదించారు. 

ఆ సమయంలో నిహారికతో చిరంజీవి సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. చిరు ప్రేమకు సరిహద్దులు ఉండవని, అతని చిరునవ్వు ప్రతి సంఘటనను ఒక వేడుకలా మారుస్తుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

Leave a Comment