గాల్వన్ లోయ ఘర్షణ వీడియోను రిలీజ్ చేసిన చైనా..!

గతేడాది జూన్ 15న గాల్వన్ లో భారత సైనికులకు, చైనా సైనికులకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. 30 మంది చైనా సైనికులు కూడా మరణించినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. కాగా తాజాగా ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోను చైనా రిలీజ్ చేసింది. 

భారత సైనికులు తమ భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకువచ్చారని చైనీస్ స్టేట్ మీడియా విశ్లేషకుడు షెన్ షివె ట్వీట్ చేశారు. కానీ ఆ వీడియోలో చైనా కమాండర్ ఒకరు భారత దళానికి వార్నింగ్ ఇస్తూ కనిపించారు. ఇక ఆ తర్వాత రెండు దేశాలకు చెందిన దళాలు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. 

ఆ తర్వాత ఇరు దేశాల సైనికులు ఒకరికొకరు తోసుకోవడం, ఫ్లాష్ లైట్ల వెలుగులో కర్రలు, షీల్డులతో తలపడడం ఈ వీడియోలో కనిపించింది. చీకటిలో గట్టి కేకలు సైతం వినిపించాయి. భారత జవాన్లు తమ పెట్రోలింగ్ పాయింట్ వద్దకు వెళ్తుండగా చైనా దళాలు అడ్డుకున్నాయి. 

దీంతో వారిని ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సమాయత్తమైంది. అయితే ఈ వీడియోను అత్యంత చాకచక్యంగా ఎడిటింగ్ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. తప్పు భారత్ వైపు మాత్రమే ఉన్నట్లు చూపించినట్లు ఆరపణలు వస్తున్నాయి. చైనా దళాలు శాంతి కాముకుల్నిగా చూపిస్తూ వీడియోను రిలీజ్ చేశారు.  

 

Leave a Comment