భారత్ లో గ్రామం ఏర్పాటు చేసిన చైనా..!

చైనా మరో దుస్సాహసానికి పాల్పడింది. అరునచల్ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చింది. అంతే కాకుండా అక్కడ ఏకంగా 101 ఇళ్లతో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది. ఈ గ్రామానికి చెందిన శాటిలైట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చైనా నిర్మించిన గ్రామం భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎగువ సబన్సిరి జిల్లా సారిచు నది ఒడ్డున ఏర్పడింది. ప్రస్తుతం చైనా ఏర్పాటు చేసినన ప్రాంతానికి సంబంధించి 2019, ఆగస్టు నాటి శాటిలైట్ ఫొటోల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. అయితే 2020, నవంబర్ నాటి చిత్రాల్లో వరుసగా ఉన్న ఇళ్లు దర్శనమిచ్చాయి. దీన్ని బట్టి గతేడాదే ఈ గ్రామం ఏర్పాటైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ సరిగా స్పందింలేదని తెలిసింది. 

బీజేపీ ఎంపీ హెచ్చరించినా…

అయితే చైనా దుస్సాహసంపై గతేదాడి నవంబర్ లోనే ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ తపిర్ గావో ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చేపట్టిన నిర్మాణాల గురించి, ప్రత్యేకంగా ఎగువ సుబున్సిరి జిల్లా గురించి హెచ్చరించారు. ప్రస్తుతం కూడా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. చైనా ఎగువ సబన్సిరి జిల్లాలో నది వెంబడి 60-70 కిలోమీటర్లు లోనికి ప్రవేశించిందన్నారు. అక్కడ డబుల్ లేన్ రోడ్డు నిర్మాణం కూడా చేపడుతోందని అన్నారు. 

 

You might also like
Leave A Reply

Your email address will not be published.