భారత వెబ్ సైట్లు బ్లాక్ చేసిన చైనా..

ఇండియా-చైనా సరిహద్దులో ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య వివాదం ముదురుతోంది. భద్రత దృష్ట్యా టిక్ టాక్, యూసీ బ్రౌజర్ తో సహా 59 చైనీస్ యాప్లను ఇండియా నిషేధించింది. అయితే దీనికి కౌంటర్ గా చైనా కూడా తనదైన శైలిలో స్పందించింది. చైనాలో భారత్ కు చెందిన వెబ్ సైట్లు, న్యూస్ పేపర్లను అక్కడి వారు చదివే అవకాశం లేకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇండియా వెబ్ సైట్లు, న్యూస్ పేపర్లను బ్లాక్ చేసింది. 

ఇప్పటి వరకు ఇండియన్ టీవీ ఛానెళ్లను ఐపీ టీవీ ద్వారా చూసేవారు. బ్యాన్ కారణంగా ప్రస్తుతం వాటిని వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ ద్వారా మాత్రమే చూడగలుగుతున్నారు. భారత్ లో చైనీస్ యాప్లను నిషేధించిన నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. గత రెండు రోజులుగా ఈ వెబ్ సైట్లు ఓపెన్ కావడం లేదు. ఐఫోన్, డెస్క్ టాప్ లో కూడా రావడం లేదని అక్కడి యూజర్లు తెలిపారు. 

కాకపోతే ఏ దేశంలో అయినా బ్లాక్ చేయబడిన సైట్లు, యాప్లను మళ్లీ యాక్టివ్ చేసేందుకు వీపీఎన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ చైనా మాత్రం ఆ సర్వీసులను కూడా పని చేయకుండా చేయగలిగింది. వీపీఎన్ లను కూడా బ్లాక్ చేసే అధునాతన టెక్నాలజీ చైనా  దగ్గర ఉన్నట్లు సమాచారం. 

Leave a Comment