మనుషుల కంటే వేగంగా..నంబర్స్ గుర్తించిన చింపాంజీ.. వీడియో వైరల్..!

చింపాంజీలు, మనుషులకు మధ్య దగ్గరి సంబంధం ఉన్న సంగతి తెలిసిందే.. మనుషుల తర్వాత తెలివైన జంతువులుగా కోతులు, చింపాంజీలను పరిగణిస్తారు. కోతుల డీఎన్ఏ, మనుషుల డీఎన్ఏ  దాదాపు 18 శాతం సమానంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.. అందుకే చింపాంజీలు కూడా మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తాయి. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.. ఆ వీడియోలో ఓ చింపాంజీ మనిషి మాదిరిగానే ప్రవర్తించింది. సాధారణంగా చింపాంజీలు మనుషులు చేసే పనులు చేస్తుంటాయి.. కానీ నంబర్స్ ని మాత్రం చింపాంజీలు గుర్తించలేవు.. కానీ ఇక్కడ ఓ చింపాంజీ నంబర్ గేమ్ ఆడుతోంది.. 1 నుంచి 9 వరకు ఉన్న నంబర్స్ స్క్రీన్ పై కనిపించగానే.. వాటిని చాలా వేగంగా క్రమ వరసలో టచ్ చేస్తోంది.. 

లాస్ట్ ఇన్ హిస్టరీ అనే అకౌంట్ తో ఉన్న ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.. ఈ వీడియోకు ‘చింపాంజీలు అద్భుతమైన మెమోరీ స్కిల్స్ కలిగి ఉన్నాయని నిరూపించాయి’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో చింపాంజీ 1 నుంచి 9 వరకు అన్ని నంబర్లను గుర్తుపడుతోంది..అసలు స్క్రీన్ పై ఆర్డర్ లో లేని నంబర్లను చాలా వేగంగా వరుసక్రమంలో గుర్తిస్తోంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 

Leave a Comment