టెర్రరిస్టులకు ఎదురెళ్లి పోరాడిన ఏపీ బాలిక.. హిమప్రియకు బాలపురస్కారం..!

టెర్రరిస్టులు దాడి చేశారని వింటేనే వణుకుపుడుతుంది. వారికి ఎదురెళ్లి పోరాడాలంటే ఎంతో ధైర్యసాహసాలు కావాలి. కానీ 8 ఏళ్ల వయస్సులోనే ఈ చిన్నారి టెర్రరిస్టును ఎదిరించింది. ఆర్మీ క్వార్టర్స్ లో చొరబడి దాడి చేస్తున్న పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రవాదికి ధైర్యంగా ఎదురు నిలిచింది. ఉగ్రవాదుల నుంచి తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో పాటు క్వార్టర్స్ లో ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. ఆమెనే శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియ.. ఆమె చూపిన ధైర్యానికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి ఎంపికైంది. శ్రీకాకుళం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకుంది. 

హిమప్రియ ఏంచేసిందంటే?

హిమ ప్రియ తండ్రి ఆర్మీ అధికారి.. ఆమె తండ్రి సత్యనారాయణ జమ్మూ కశ్మీర్ లో విధులు నిర్వహిస్తుండటంతో అక్కడి క్వార్టర్స్ లో నివాసం ఉండేవారు. 2018 ఫిబ్రవరి 10న ఆర్మీ క్వార్టర్స్ పై ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో హిమప్రియ తల్లితోపాటు ఇంట్లో ఉంది. తండ్రి ఏమో 60 కి.మీ. దూరంలో డ్యూటీలో ఉన్నాడు. ఉగ్రదాడిలో హిమప్రియ తల్లికి గాయాలయ్యాయి. హిమప్రియ మాత్రం సాహసం చేసి ఉద్రవాదిని ఎదిరించింది. భయపడకుండా వారితో పోరాడింది. క్వార్టర్స్ లోని తన తల్లి, చెల్లెళ్లతో పాటు మరికొంత మందిని కాపాడింది. 

ఆ సమయంలో చిన్నారి ప్రదర్శించిన సాహసానికి ఆమెకు అవార్డ్ వరించింది. సాహస బాలిక అవార్డుకు ఎంపికైన హిమప్రియకు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున సోమవారం అవార్డు అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ఆమెను ప్రధాని మోడీ ప్రశంసించారు.    

    

 

Leave a Comment