అమాయక యువతులే ఈ ఎస్సై టార్గెట్.. ప్రేమ పేరుతో మోసాలు.. ఓ యువతి ఆత్మహత్య..!

ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్సై విజయ్ కుమార్ నాయక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు అనంతపురం జిల్లా పామిడి మండలంలోని జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన విజయ్ కుమార్ నాయక్ చంద్రగిరిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. విజయ్ కుమార్ అనంతపురంకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు.. తర్వాత పెళ్లికి నో అనడంతో ఆమె ‘దిశ’ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువతిని ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. 

అయితే విజయ్ కుమార్ జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన సరస్వతి అనే యువతితోనూ ప్రేమాయనం కొనసాగించాడు. సరస్వతి ఓ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉండేది. కొద్ది రోజుల క్రితం వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో రెండు రోజుల క్రితం సరస్వతి తన స్వగ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. 

చికిత్స పొందుతూ శుక్రవారం అనంతపురం ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. ప్రేమించి మోసం చేశాడని సరస్వతి తండ్రి ఎస్సై విజయ్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విజయ్ కుమార్ ని అరెస్ట్ చేశారు. ఎస్సై విజయ్ కుమార్ గతంలోనూ ఓ మహిళా కానిస్టేబుల్ ను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు సమాచారం.  

 

Leave a Comment