జగన్ ఒక ఫేక్ సీఎం.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా? : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ ముమ్మాటికీ ఫేక్ ముఖ్యమంత్రి అని, అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని టీడీజీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ పింఛన్ల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. 

టీడీపీ హయాంలో 44.32 లక్షల పింఛన్లు ఇచ్చినట్లు చెప్పారని, టీడీపీ హయాంలో 50.29 లక్షల మందికి పింఛన్లు అందజేశామని చంద్రబాబు వెల్లడించారు. సీఎం జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. ఏటా పింఛన్లు మొత్తం పెంచుకుంటూ వెళ్తామని చెప్పారని, ఈ ఏడాది ఇవ్వాల్సిన పింఛన్ మొత్తం వచ్చే ఏడాది ఇస్తామంటున్నారని తెలిపారు. 

టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే రూ.3 వేలు పింఛను ఇచ్చేవాళ్లమన్నారు. ఒక్కో లబ్ధిదారు రూ.40 వేలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.18,750 పింఛను ఇస్తోందదని, వైసీపీ వచ్చాక పెన్షన్లను భారీగా తొలగించారని ఆరోపించారు. టీడీపీకి చెందిన వారికి పెన్షన్, రేషన్ కట్ చేశారని విమర్శించారు. 

ఫేక్ మీడియాను పెట్టుకుని అసత్యాలు ప్రచారం చేశారన్నారు. అసెంబ్లీని వైసీపీ నేతలు తప్పుదారి పట్టించారన్నారు. వాస్తవాలు చెబితే అచ్చెన్నాయుడుపై ఎదురుదాడి చేశార్నారు.  టీడీపీ వాళ్లు అసెంబ్లీకీ రాకూడదని అంటున్నారని, అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీలో అధికారపక్షం డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.   

సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన మీపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలన్నారు. జగన్ ఒక జీరో సీఎం.. అవగాహన లేని ముఖ్యమంత్రి అని చంద్రబాబు విమర్శించారు. ఏకపక్షంగా అసెంబ్లీ నడుపుకుంటారా?.. నడపండి చూద్దాం.. తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. 

 

Leave a Comment