‘ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు అన్ ఫిట్’.. సీఎం జగన్ వ్యాఖ్యలపై మీరేమంటారు..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశామని చెప్పుకుంటున్నారు కానీ.. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా కూడా అన్ ఫిట్ అంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఎద్దేవా చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో పోలవరం నిర్వాసితుల పరిహారం చెల్లింపులపై ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. 

ఆ సమయంలో సీఎం జగన్ వెంటనే స్పందించారు. పోలవరంను నాశనం చేసింది టీడీపీ ప్రభుత్వమే అంటూ మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీకి సంబంధించి జోవో కూడా ఇచ్చామన్నారు. ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గతంలో రూ.6.86 లక్షలు ఇస్తే.. తాము 10 లక్షలు ఇస్తామని చెప్పామని, దీనిపై జీవో కూడా జారీ చేశామని అన్నారు. పునరావాసం, పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 14,110 మంది నిర్వాసితులకు రూ.19,060 కోట్లతో పునరావాసం కల్పించామన్నారు. 

తమ ప్రభుత్వం మాటలకు కట్టుబడి ఉందని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే అని విమర్శించారు. మొదటి స్పిల్ వే, అప్రోచ్ పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత కాపర్ డ్యాం కట్టాల్సి ఉందని అన్నారు. మళ్లీ ప్రాజెక్ట్ దగ్గర జయము, జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా కూడా అన్ ఫిట్ అంటూ మండిపడ్డారు. పోలవరం విషయంలో టీడీపీ హయాంలో జరిగిన తప్పులను తాము సరి చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. 

ఇది టీడీపీ తప్పేనా..

ఇక అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు కదా.. అంటే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు కదా.. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగినా.. ఆలస్యం జరిగినా.. అందులో మెజార్టీ వాటా కేంద్రంలో ఉన్న బీజేపీది కూడా.. మరీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించినట్లే.. ప్రధాని మోడీని విమర్శించగలరా.. ఒకవేళ పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే.. సీఎం జగన్ కూడా ‘అన్ ఫిట్’ ముద్ర మోయాల్సిందే కదా.. సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీరేమంటారు..  

Leave a Comment