చంద్రబాబు పెగసస్ స్పైవేర్ కొన్నారు.. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. వివాదాస్పద పెగసస్ స్పైవేర్ ని చంద్రబాబు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ వివాదాస్పద స్పైవేర్ ని కొన్నట్లు మమతా వెల్లడించారు. 

బెంగాల్ అసెంబ్లీ సమావేశాల్లో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగైదేళ్ల క్రితం ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ సంస్థ పెగసస్ సాఫ్ట్ వేర్ ను రూ.25 కోట్లకు అందిస్తామని తమ రాష్ట్ర పోలీసులకు సంప్రదించిందని, అయితే ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధమైందని తాము కోనుగోలు చేయలేదని వెల్లడించారు.

 ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ సాఫ్ట్ వేర్ ని కోనుగోలు చేసిందని మమతా వెల్లడించారు. ఈ స్పైవేర్ ని కేంద్ర ప్రభుత్వం కోనుగోలు చేసిందని మమతా పేర్కొన్నారు. అయితే దానిని దేశ భద్రత కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్షనేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందని ఆరోపించారు.    

 

Leave a Comment