చంద్రబాబు.. జగన్ కు జైలుకు పంపించగలడు – వైసీపీ ఎంపీ

అబద్ధాలు చెప్పి జగన్ కు జైలుకు జీవిత ఖైదు వేయించగల సమర్థుడు చంద్రబాబు అని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. కియా ఫ్యాక్టరీ విషయంలో చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు. తనను జగన్ హత్య చేశాడని, నేను చనిపోయాను కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరేంత సమర్థుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. పోలిస్ స్టేషన్ కు తాను కాదు తన ఆత్మ వచ్చిందని భ్రమింపజేయగలడన్నారు. చనిపోకున్నా.. చనిపోయానని చెప్పి జగన్ కు జీవిత ఖైదు వేయించే సమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, ఆయన చాప్లర్ క్లోజ్ అయిందంటూ వ్యాఖ్యలు చేశారు. కియా ఫ్యాక్టరీ విషయంలో అబద్దాన్ని నిజం చేయాలని భావించారన్నారు. బాబు నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. లోక్ సభలో కియా ప్లాంట్ విషయంలో తప్పుడు ప్రచారం చేయవద్దని తాను టీడీపీ ఎంపీలను కోరానని, అబద్దం చెప్పి సభను తప్పుదోవ పట్టించవద్దని సూచించానని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.

Leave a Comment