ప్రజల్లో తిరుబాటు వచ్చేసింది.. ఇక ఆపలేరు : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలన పూర్తి వైఫల్యంగా సాగిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కడపలో కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ప్రసగించారు. మూడేళ్ల పాలనలో జగన్ సర్కార్ ప్రజలపై మోయలేని భారాలు మోపిందని మండిపడ్డారు. ఇక ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని, దీన్ని ఆపలేరని అన్నారు. 

ఒంగోలులో మహానాడుకు స్డేడియం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జగన్ లాంటి నియంగతకు తాను ఎప్పుడూ భయపడనని చంద్రబాబు అన్నారు. 3 ఏళ్ల పాలనలో… కనీసం కడపలో అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టరా? ఒక్క ప్రాజెక్ట్ కట్టారా? ఒక్క పరిశ్రమ తెచ్చారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

కర్నూలు సోలార్ ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో వచ్చిందని, అది పూర్తి అయ్యి ఉంటే ఈ రోజు పవర్ కష్టాలు ఉండేవి కాదని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వాస్తవాలు చెప్పి ప్రభుత్వ దోపిడీని వివరించాలని పిలుపునిచ్చారు. అప్పులతో జగన్ రాష్ట్ర పరువు తీశారని, దొంగ లెక్కలు రాయడం, అడ్డంగా దొరకడం జగన్ తీరు అని విమర్శించారు. 

రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారని అన్నారు. రాజ్యసభ సీట్లను ఇద్దరు తెలంగాణ, ఇద్దరు ఆంధ్ర వారికి జగన్ ఇచ్చారని, అంటే సమన్యాయం చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. సీబీఐ కేసుల్లో వాదించిన వారికి తనతో కేసుల్లో ఉన్న వారికి జగన్ రాజ్యసభ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఇవ్వడానికి సమర్థులు, వెనుకబడిన వర్గాల వారులేరా అని ప్రశ్నించారు. పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వాడు మూడు రాజధానులు కడతారా అని చంద్రబాబు అన్నారు.  

Leave a Comment