వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లు..!

కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుత సందర్భంగా వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై 10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. తగ్గిన పెట్రోల్ ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాదు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గించాలని సూచించింది.

దీపావళి సందర్భంగా ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొద్ది నెలలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయని, దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అన్ని రకాల ఇంధన కొరతను ప్రపంచం ఎదుర్కొందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం రెట్టింపు తగ్గించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని కేంద్రం అభిప్రాయపడింది.  

Leave a Comment