అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..!

కరోనా లాక్ డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం దశల వారీగా సడలిస్తోంది. జులై 31తో అన్ లాక్ 2 గడువు ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రి సమయంలో కర్ఫ్యూను రద్దు చేసింది. అయితే కంటైన్ మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని పేర్కొంది. 

వీటిపై ఆంక్షలు

  • స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు బంద్
  • మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు, బార్లు, ఆడిటోరియం, పార్కులకు అనుమతి లేదు. 
  • కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కఠినంగా అమలు
  • సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, మత పరమైన సమావేశాలపై నిషేధం కొనసాగింపు.
  • సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం

వీటిపై సండలింపు

  • రాత్రి సమయంలో కర్ఫ్యూ రద్దు చేసింది. 
  • ఆగస్టు 5 నుంచి యోగా శిక్షణ కేంద్రాలు, జిమ్ సెంటర్లకు అనుమతి. అయితే భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. 
  • భౌతిక దూరం, వైద్య నిబంధనలు పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. 
  • అంతర్జాతీయ విమాన ప్రయాణానికి వందే భారత్ మిషన్ కింద అనుమతి లభించింది. 

ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి..

  • బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
  • వివాహ వేడుకల్లో 50 మందికి మించి అనుమతించబడరు. 
  • అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ హాజరుకాకూడదు. 
  • 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇంట్లో ఉండాలి. 

Leave a Comment