నీలి చిత్రాలు చూస్తున్నారా.. అయితే నేరుగా జైలుకే.. రూ.10 లక్షలు జరిమానా..!

ప్రస్తుతం నీటి చిత్రాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు దాదా ప్రతిఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో కొందరు అదే పనిగా నీలి చిత్రాలు చూసేస్తున్నారు. అందులోనూ చిన్ని పిల్లలకు సంబంధించిన పోర్న్ వీడియోలు చేస్తున్నారు. దీని ప్రభావంతో చిన్నారులు, మైనర్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. ఇలా చిన్న పిల్లలతో తీయించిన నీలి చిత్రాలు చూసే వారిపై కేంద్రం నిఘా పెట్టింది. అలాంటి నీలి చిత్రాలు చూస్తున్న వారు నేరుగా జైలుకే వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా నీలి చిత్రాలు చేసే వారి వివరాలను ఐపీ అడ్రస్ ద్వారా కనుక్కొని ఇంటింటికి వెళ్లి మరీ అరెస్టు చేస్తున్నారు..

గత నాలుగైదేళ్లుగా చిన్నిపిల్లలతో చిత్రీకరించిన పోర్న్ వీడియోల వెబ్ సైట్లను చూసే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో చిన్నారులపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర హోం శాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిణించింది. దేశవ్యాప్తంగా అలా చూస్తున్న వారిని గుర్తించి వారి ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్ల ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి ఆయా రాష్ట్రాలకు పంపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 1,095 మందిని అరెస్ట్ చేశారు. 

ఎవరికీ తెలియకుండా ఏ మారుమూల ప్రాంతంలో నుంచి అయినా పోర్న్ సైట్లు చూస్తుంటే.. వారిని జాతీయ నేర గణాంకాల బ్యూరో గుర్తిస్తుంది. అలా గుర్తించేందుకు ‘ఈ బ్యూరో సీ సామ్’ అనే అమెరికా సంస్థతో నాలుగేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ అందజేసే వివరాలతో పాటు కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక యాప్ ల ద్వారా వారిని గుర్తించే పనిలో ఉన్నారు. 

ఈ పోర్న్ వీడియోలు చేసే వారి విషయంలో న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మొదటిసారి దొరికిన వారికి ఐదేళ్ల జైలు, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తాయి. రెండో సారి దొరికితే ఏడేళ్ల పాటు జైలులోనే ఉండాలి. దీంతో పాటు రూ.10 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో రెండేళ్ల క్రితం 16 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది కూడా 20 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు నిందితులపై రెండోసారి కేసులు నమోదయ్యాయి. ఒంటరిగా ఉన్నాం కదా అని అదేపనిగా ఆ వీడియోలు చూస్తుంటే జాగ్రత్త.. మీరు జైలుకు వెళ్లడం ఖాయం అవుతుంది.   

Leave a Comment