కొత్త విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం..!

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మారుస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యావిధానం ఉండనున్నట్లు తెలుస్తోంది. మూడు నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందంచడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

జాతీయ విద్యా విధానంలో మార్పులు..

  • ప్రస్తుతం ఉన్న 10+2+3 విధానాన్ని 5+3+3+4 గా మార్చారు. 
  • ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ అమలు
  • కొత్త విధానంలో ఇంటర్ విద్య రద్దు
  • డిగ్రీ విద్య నాలుగేళ్లుగా మార్పు
  • ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్రోగ్రామింగ్ కరికులమ్ 
  • ఆరో తరగతి నుంచే వొకేషనల్ కోర్సులు
  • విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం

Leave a Comment