కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందట.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..!

కరోనా పోయిందని అందరూ హాయిగా తిరుగుతున్నారు. అయితే పరిస్థితులు మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్ లోనూ కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ ఓ లేఖ రాశారు. 

ఫై ఫోల్డ్ స్ట్రాటజీ పాటించాలని లేఖలో రాజేశ్ భూషన్ సూచించారు. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్.. వ్యాక్సినేషన్.. నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. వీలైనన్నీ కరోనా శాంపిల్స్ ని ఇన్సాకాగ్ కి పంపాలన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ జారీ చేసిన ప్రొటోకాల్ ప్రకారం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి శాంపిళ్లను ఎక్కువగా పంపాలన్నారు. దీని వల్ల కొత్త వేరియంట్లను గుర్తించవచ్చన్నారు. బహిరంగ ప్రదేశాలు, సామూహిక కార్యక్రమాల్లో మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలపై అవగాహన పెంచాలని లేఖలో పేర్కొన్నారు. 

Leave a Comment