లైంగిక దాడులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!

దేశంలో లైంగిక దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అఘాయిత్యాలు పాల్పడుతున్నారు. కొన్నిఅత్యాచార ఘటనలు దేశంలో దుమారం రేపుతున్నాయి. మరి కొన్ని అసలు వెలుగులోకి రావడం లేదు. గప్ చుప్ గా సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.   

కొత్త మార్గదర్శకాలు..

  • లైంగిక దాడి ఘటనలో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ నేరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాకపోతే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాలి. ఒక వేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఆ అధికారికి శిక్ష ఉంటుంది.
  • రేప్ కేసుల్లో పోలీసులు 60 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’ ఆన్ లైన్ పోర్టల్ ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. 
  • మహిళలపై లైంగిక దాడి గురించి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. 
  • బాధితురాలి మరణ వాంగ్మూలం న్యాయాధికారి సమక్షంలో రికార్డు చేయనప్పటికీ కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. 
  • లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్ అసల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్లను ఉపయోగించాలి. 
  • లైంగిక దాడి కేసుల్లో పోలీసులు నిబంధనలను పాటించకపోతే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయి. 

Leave a Comment