క్వాలిటీ లేని వస్తువుల అమ్మకం.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు నోటీసులు..!

క్వాలిటీ లేని వస్తువులు అమ్మినందుకు ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) ఈ నోటీసులు జారీ చేసింది. బీఐఎస్ నిబంధనలకు అనుగుణంగా లేని ప్రెషర్ కుక్కర్ లను అమ్మినందుకు ఈ నోటీసులు ఇచ్చింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, పేటీఎంమాల్ తదితర ఈకామర్స్ సంస్థలకు ఈనెల 18న నోటీసులు జారీ అయ్యాయి..

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా నాణ్యత నియంత్రణ నిబంధలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సీసీపీఎ స్పష్టం చేసింది. ఈకామర్స్ ప్లాట్ పారమ్ లలో అమ్మే 13 ఉత్పత్తులపై సీసీపీఎ దృష్టి సారించింది. 

సీసీపీఎ పరిశీలనలో ఉన్న ఉత్పత్తులు ఇవే..

అమెజాన్ లో

 • అమెజాన్ బేసిక్స్ స్టెయిన్ లెస్ స్టీల్ ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్- 4 లీటర్స్
 • క్యూబా 5 లీటర్ ఇండక్షన్ బేస్ అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ 

ఫ్లిప్ కార్ట్ లో

 • క్యూబా అల్యూమినియం రెగ్యులర్ 5 లీటర్స్ ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్
 • ప్రిస్టైన్ స్టెయిన్ లెస్ స్టీల్ 5 లీటర్స్ ఇండక్షన్ బాటమ్ ప్రెజర్ కుక్కర్
 • డైమండ్ బై ఫాస్ట్ కలర్స్ ఔటర్ లిడ్ 100 మినీ ప్రీమియం

పేటీఎంమాల్ లో

 • ప్రిస్టైన్ 5.5 లీటర్స్ ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్(సిల్వర్, స్టెయిన్ లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1)
 • క్యూబా 5 లీటర్ల ఇన్నర్ మూత ప్రెజర్ కుక్కర్ ఇండక్షన్ బాటమ్(సిల్వర్, అల్యూమినియం, సెట్ ఆఫ్ 1)
 • ఎథికల్ కుక్ వేర్ కాంబోస్ ఇండక్షన్ బాటమ్(స్టెయిన్ లెస్ స్టీల్, సెట్ ఆఫ్ 1)

స్నాప్ డీల్ లో

 • ఇండక్షన్ బేస్ లేకుండా ఎబోడ్ 5 లీటర్స్ అల్యూమినియం ఔటర్ లిడ్ ప్రెజర్ కుక్కర్
 • బిస్టెక్ మిర్రర్ ఫినిష్ ఇండక్షన్ స్టవ్ టాప్  చెర్రీ ప్రెజర్ కుక్కర్

షాప్ క్లూస్.కామ్ లో

 • క్యూబా అల్యూమినియం రెగ్యులర్ 5 లీటర్స్ ప్రెజర్ కుక్కర్
 • ప్రిస్టైన్ ఇండక్షన్ బేస్ స్టెయిన్ లెస్ స్టీల్ 5 లీటర్స్ ప్రెజర్ కుక్కర్ 
 • ఎథికల్ టీఆర్ఐ-నేచర్ ప్రెజర్ కుక్కర్
 • ఇండక్షన్ బోటమ్ స్టెయిన్ లెస్ స్టీల్ ట్రైప్లే ఎస్ఏఎస్ 

 

Leave a Comment