CBN అంటే ‘కరోనాకు భయపడే నాయుడు’ : సీఎం జగన్

తుఫాన్ తో నష్టపోయిన రైతులను చంద్రబాబు నాయుడు పరామర్శించలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పంట నష్టంపై సీఎం జగన్ మాట్లాడారు. సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని విమర్శించారు. కరోనాకు భయపడి హైదరాబాద్ లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. 

అసెంబ్లీలో చంద్రబాబు ఎందుకు రెచ్చిపోయారో అర్థం కావడం లేదని, ఎల్లో మీడియా కవరేజ్ కోసం డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. తాను ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా తానెప్పుడు పొడియం దగ్గరకు రాలేదన్నారు. చంబ్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.  

 

Leave a Comment