కరోనా ఎఫెక్ట్ : భారీ పరిహారం కోరుతూ చైనాపై కేసు..

కరోనా వైరస్ ను చైనా సృష్టించి వ్యాప్తి చేసిందని అమెరికాకు చెందిన లారీ క్టేమన్ అనే న్యాయవాది కేసు దాఖాలు చేశారు. రూ.20లక్షల కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని కోరారు. క్టేమన్ కు చెందిన ఫ్రీడం వాచ్ అండ్ బజ్ ఫోటోస్ అనే సంస్థ టెక్సాస్ లోని అమెరికా జిల్లా కోర్టులో ఈ కేసు నమోదు చేసింది. కరోనా వైరస్ ను జీవరసాయన ఆయుధంగా డిజైన్ చేసిందని ఆరోపించారు. అమెరికా చట్టంతో పాటు అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు, నిబంధనలను చైనా ఉల్లంఘించిందన్నారు. 

ఇతర దేశాల ప్రజలను చంపే ఉద్దేశంతోనే చైనా ఈ వైరస్ ను రూపొందించిందని క్లేమన్ ఆరోపించారు. చైనా సృష్టించిన ఈ వైరస్ తో ప్రపంచానికి వాటిల్లిన నష్టానికి గాను 20 లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలన్నారు. చైనాలోని వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ వైరస్ ను విడుదల చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. 

అమెరికా సేనలు ఈ వైరస్ ను తమకు అంటగట్టారని చైనా ఆరోపించిన నేపథ్యంలో దీనిని రూపొందించింది చైనానే అని అమెరికా ఆరోపించింది. ఈ వైరస్ ను హెచ్చరించిన వారిని సైతం చైనా శక్షించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే…

Leave a Comment