ముఖేష్ అంబానీ జీతం ‘సున్నా’ అంటే నమ్ముతారా? 

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సున్నా అంటే నమ్ముతారా? నమ్మరు కదూ.. కానీ అది నిజం.. ముకేశ్ అంబానీ వరుసగా రెండో సంవత్సరం ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు.. ఈ మేరకు 2021-22 ఆర్థికి సంవత్సరానికి రిలయన్స్ తన వార్షిక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికల ఆయన వేతనాన్ని ‘సున్నా’గా చూపించింది.. మరీ ఆయన జీతం ఎందుకు తీసుకోకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

కరోనా అందరి జీవితాలను అస్తవ్యస్తం చేసింది.. వ్యాపారాలు దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈనేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ముకేశ్ అంబానీ తన వార్షిక వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. దానిని 2021-22లోనూ కొనసాగించారు. ఈ రెండు సంవత్సరాల్లో అంబానీ ఎటువంటి అలెవెన్సులు, ముందస్తు ఖర్చులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, కమీషన్లు, స్టాక్ ఆప్షన్లను తీసుకోలేదు.. చివరిసారిగా 2019-20 ఆర్థిక సంవత్సారిని గానూ ఆయన రూ.15 కోట్ల వేతనం అందుకున్నారు.    

Leave a Comment