ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాదికి ఉద్యోగాల కాలెండర్..!

ఏపీలో త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సురం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉగాది రోజుల క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ ఏడాది 6 వేల మంది పోలీసు నియామకాలు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు పలు శాఖల్లో మిగిలి ఉన్న పోస్టులు నోటిఫికేషన్ల వివరాలను క్యాలెండర్ లో పొందు పరచనున్నారు. 

విద్యారంగంలో కీలక మార్పులు..

మరో వైపు విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజిల్లో ప్రశ్నపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేసింది. అన్ని కాలేజీలకు జేఎన్టీయూ తయారు చేసిన ప్రశ్నపత్రాలే ఉండాలని నిర్ణయించారు. అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలకు ఇవే ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రశ్నపత్రాల వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే అధికారం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

 

Leave a Comment