సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా? తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేకపోతే నష్టపోతారు..!

ప్రస్తుతం దేశంలో ద్విచక్రవాహనాలు ధరలు భారీగా ఉన్నాయి. దీంతో కొత్త బైక్ కొనుగోలు చేసేందుకు బడ్జెట్ తక్కువగా ఉన్నవారు సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. తమకు అందుబాటులో ఉన్న ధరలో సెకండ్ హ్యాండ్ బైక్ కొంటారు. కానీ తరచుగా సెకండ్ హ్యాండ్ బైక్ కొన్న తర్వాత, దాని మైలేజ్, ఇంజిన్ లేదా ఇతర విషయాల వల్ల కొందరు ఆందోళన చెందుతారు. ఎందుకంటే బైక్ కొనుగోలు చేసేటప్పుడు, వారికి చాలా విషయాలు తెలియవు. సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసేటప్పుడు మీరు గుర్తించుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం. 

సెకండ్ హ్యాండ్ బైక్ కొనేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు:

బైక్ ఇంజిన్:

సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా దాని ఇంజిన్‌పై శ్రద్ధ వహించాలి. బైక్ నడపడమే కాకుండా దాని ఇంజిన్, ఇంజిన్ పొగను వదలడం లేదా, ఇంజన్ ఆయిల్ ఎక్కడి నుంచైనా లీక్ అవుతుందా మొదలైన వాటిని చెక్ చేసుకోండి.

బైక్ పరిస్థితి:

బైక్ ఇంజిన్ తర్వాత బైక్ యొక్క బాడీని చెక్ చేయాలి. దాని అన్ని భాగాలు సురక్షితంగా మరియు అసలైనవి ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. బైక్ కొన్న తర్వాత మీరు కొత్త పార్ట్స్ ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

బైక్ యాక్సిడెంట్ హిస్టరీ:

సెకండ్ హ్యాండ్ బైక్‌ను తీసుకునే ముందు, బైక్‌కు ఏదైన ప్రమాదం జరిగిందా అనే విషయం చెక్ చేసుకోండి. ఎందుకంటే తరచుగా ప్రమాదం జరిగిన తర్వాత బైక్‌లో అసలు పార్ట్స్ ని ఫిట్ చేయరు. దాని వల్ల ప్రమాదం మాత్రమే కాదు. బైక్ కూడా సరిగ్గా నడవదు.

బైక్ యొక్క పూర్తి పత్రాలు:

సెకండ్ హ్యాండ్ బైక్‌ను తీసుకునే ముందు, దాని పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. దాని యాజమాన్యం, దాని కాలుష్యం మరియు బీమా లేదా ఈ బైక్‌పై ఎలాంటి రుణం లేదా క్రిమినల్ కేసు ఉన్నాయా చూసుకోండి. 

 

Leave a Comment