కరోనా టైంలో బన్నీ టూర్..ఎలా అనుమతిచ్చారు?

కరోనా సమయంలో ముఖ్యమైన పనులకు మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక పర్యాటలకు అయితే అధికారులు అస్సలు అనుమతించడం లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. కుటుంబ సమేతంగా కుంటాల జలపాతాన్ని సందర్శించారు. జలపాతం జాలువారే అందాలను వీక్షించారు. అటవీశాఖ అధికారులు అల్లు అర్జున్ దగ్గరుండి జలపాతం విశిష్టతను, ఇక్కడి అందాల గురించి వివరించారు. అనంతరం అల్లు అర్జున్ ఆదిలాబాద్ పట్టణ శివారులో ఉన్న హరితవనం పార్కులో సఫారీలో తిరుగుతూ అందాలని వీక్షించారు.  

అయితే ఇంత కాలం జలపాతం చూసేందుకు పర్యాటకులను అనుమతించని అధికారులు, ప్రముఖులకు మాత్రం దగ్గరుండి చూపించడంపై విమర్శలు వస్తున్నాయి. సెలెబ్రెటీలకు ఓ న్యాయం తమకు ఓ న్యాయమా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇటీవల నిర్మాత దిల్ రాజు కుటుంబంతో పాటు కుంటాల జలపాతాన్ని సందర్శించారు.  ఇతరులను సందర్శణకు రానివ్వని అధికారులు సెలబ్రెటీలను మాత్రం పక్కన ఉండి చూపించడం ఏంటంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. 

 

Leave a Comment