మహేష్ తో మరోసారి బన్నీ పోటీ..

మెగాస్టర్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో చిరు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక పాత్ర కోసం చిరు నక్సలైట్ గా కనిపించునున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారని ఈ మధ్య వార్తలు తెగ షికర్లు చేస్తున్నాయి. ఈ పాత్ర కోసం మహేష్ 30 రోజుల కాల్ షీట్ ఇచ్చాడని, రోజుకు కోటి రూపాయల చొప్పున 30 కోట్లు తీసుకుటున్నారని తెలుస్తుంది. అయితే తాజాగా ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ పోటీ పడుతున్నాడని తెలుస్తుంది.

అసలు ఈ పాత్ర రామ్ చరణ్ చేయాల్సింది కానీ డేట్స్ కుదరక ఆ స్థానంలో మహేష్ ను తీసుకున్నారు. ఇప్పుడు ఆ పాత్ర తాను చేస్తానంటూ బన్నీ ముందుకు వచ్చాడు. చిరు తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని బన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఇందు కోసం అల్లు అరవింద్ తో సంప్రదింపులు చేస్తున్నాడట బన్నీ. వ్యక్తిగతంగా కూడా మహేష్ అంటే చిరుకు ఎంతో అభిమానం..మహేష్ చరణ్ కి బాగా క్లోజ్. ఆ రకంగా ఆ ఇద్దరూ మహేష్ వైపే మొగ్గు చేపుతున్నరన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ మహేష్ ఓకే అయితే మెగా ఫ్యాన్స్ కు బన్నీ ఫ్యాన్స్ కు దూరం పెరిగే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

Leave a Comment