బండి సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు : కేటీఆర్

తాము గెలిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేవలం కొన్ని ఓట్లు, కొన్ని సీట్ల కోసం సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సంజయ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం సీట్ల కోసం బీజేపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డాడు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్లీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  

 

Leave a Comment