ప్రధాని మోడీ ప్రారంభించిన 5 రోజులకే.. ఎక్స్ ప్రెస్ వే ధ్వంసం..!

ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను ఈ నెల16 ప్రధానమంత్రి మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌ ప్రారంభించారు. రూ. 14,850 కోట్లతో ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను గడవు కంటే 8 నెలల ముందే పూర్తి చేసినట్లు ఘనంగా ప్రకటించారు. అయితే ప్రారంభించిన ఐదు రోజులకే భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల రోడ్డు ధ్వంసం అయింది. 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎక్స్ ప్రెస్ వే ప్రారంభించిన ఐదు రోజులకే ధ్వంసం కావడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. ప్రధాని మోడీ ప్రారంభించిన రోడ్డు దుస్థితి ఇదీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి..  

Leave a Comment