BSNL 4G టెంటర్లు రద్దు..

BSNL 4G అప్ గ్రేడేషన్ టెండర్ ను టెలికమ్యూనికేషన్ విభాగం బుధవారం రద్దు చేసింది. అప్ గ్రేడేషన్ ప్రాసెస్ కోసం తాజా స్పెసిఫికేషన్లను జారీ చేయాలని డిఓటి నిర్ణయించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అప్ గ్రేడ్ కోసం చైనా పరికరాలను ఉపయోగించవద్దని కేంద్ర ప్రభుత్వం BSNL కు సూచించింది. 

అప్ గ్రేడేషన్ ప్రక్రియను సమీక్షించడానికి ఆరుగురు సభ్యుల కమిటీని డీఓటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత వచ్చే రెండు వారాల్లో కొత్త టెండర్ జారీ చేస్తారు. ఈ టెండర్ లో చైనా పరికరాలను ఉపయోగించకుండా ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో తయారయ్యే పరికరాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రైవేటు టెలికాం ప్రొవైడర్లతో కూడా డీఓటీ సంప్రదింపులు జరుపుతోంది. 

భారత టెలికాం రంగం విదేశీ పరికరాలపై ఆధారపడకుండా మరియు దేశీయ పరికరాల తయారీని పెంచేందుకు డీఓటీ ప్రోత్సహిస్తోంది. 5జీ స్పెక్ట్రం పరీక్షను ప్రారంభించే పనిలో కూడా డీఓటీ ఉంది.  

Leave a Comment