బీఎస్-6 వాహనాలు వచ్చేస్తున్నాయ్..

ఏప్రిల్ లో బీఎస్-6(భారత్ స్టాండర్డ్ -6) వాహనాలు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆటో మొబైల్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు మార్కెట్లో అమ్ముడుపోని బీఎస్-4 వాహనాల పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారింది. 

దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బీఎస్-4 వాహనాలు విక్రయాలు మార్చి 31 లోగా పూర్తి చేయాలి. కానీ కరోనా వైరస్ ప్రభావం, వినియోగదారులు ఆసక్తి చూపకపోవడం కారణంగా ఇప్పటి వరకు బీఎస్-4 వాహనాల విక్రయాలు పూర్తి కాలేదు. నిల్వలు చాలా వరకు డీలర్ల వద్ద అలాగే ఉన్నాయి. ఇప్పుడు విక్రయాలు పూర్తి చేసేందుకు ఇంకా 13 రోజులే గడువు ఉంది. ఈ క్రమంవలో వాహనాల డీలర్లు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు భారీ ఆఫర్లు పెట్టినా వినియోగదారులు ఆకర్శితులు కావడం లేదు. దీంతో తమ వాహనాల విక్రయాల కోసం గడువు పెంచాలని కోరుతున్నారు. ఇప్పటికే మరోసారి వారు సుప్రీం గడప తొక్కారు. గడువు పెంచుతూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. 

మరో వైపు వచ్చే నెల నుంచి బీఎస్-6 వాహనాలు రోడ్లపై హల్ చల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి మార్కెట్లోకి రావడం వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. బీఎస్-6 వాహనాలు కాలుష్య ఉద్గారాలను తక్కువగా విడుదల చేసేలా ఉత్పత్తి చేశారు. ఇందు కోసం ఇంజిన్లలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించారు. దీని కోసం వినియోగదారులు కూడా వేచి చేస్తున్నారు. వినియోగదారులు బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేయకపోవడానికి బహుశా ఇదది కూడా ఓ కారణం కావచ్చు. బీఎస్ -6 వాహనాలకు ఇంధనం కూడా ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహనాలు మార్కెట్లోకి వచ్చే సరికి ఆయిల్ కంపెనీలు కూడా ప్రత్యేక ఇంధనాన్ని సరఫరా చేయనున్నాయి. 

Leave a Comment