ప్రియుడితో వధువు జంప్.. ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడికి షాక్..!

పెళ్లికి అంతా సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే పెళ్లి కూతురు తన ప్రియుడితో పారిపోయింది. దీంతో ముహూర్తం సమయానికి పెళ్లి జరగాల్సిందే అంటూ వరుడు ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. ఈ పెళ్లి చెల్లదని అధికారులు చెప్పడంతో వరుడు షాక్ అయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండీలో చోటుచేసుకుంది. 

 మాల్పడా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తితో ఈనెల 16న పెళ్లి నిశ్చయమైంది. సాయంత్రం పెళ్లి జరగాల్సి ఉండగా వధువు తన ప్రియుడితో ఊరి నుంచి పారిపోయింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇదే ముహూర్తానికి పెళ్లి జరపాలని వరుడు పట్టుబట్టాడు. 

వధువు చెల్లితో అయినా సరే పెళ్లి జరిపించాలన్నాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి జరిపించి అత్తారింటికి పంపించారు. అమ్మాయికి 15 ఏళ్లే ఉన్నాయి. ఇంకా పదో తరగతి చదువుతోంది కాబట్టి అది బాల్య వివాహం అవుతుంది. ఈ విషయం అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు వరుడి ఇంటికి వచ్చిన ఆ బాలికను రక్షించారు. బాలికకు 18 ఏళ్లు వచ్చేదాక అత్తారింటికి పంపవద్దని సూచించారు. మైనర్ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగిచిన ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 

Leave a Comment