వధువు డ్యాన్స్ చేసిందని.. పెళ్లి వేదికపైనే విడాకులిచ్చిన వరుడు..!

పెళ్లిలో పాటలు.. డ్యాన్స్ లు ప్రస్తుతం ట్రెండ్.. పెళ్లిలోనే వధూవరులు ఇద్దరు డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేయడం సహజమే.. కానీ ఇరాక్ లో జరిగిన ఓ పెళ్లిలో మాత్రం కథ అడ్డం తిరిగింది. పెళ్లిలో స్టెప్పులు వేసిందని భార్యకు విడాకులిచ్చాడు ఓ భర్త.. 

వివరాల మేరకు బాగ్దాద్ లో ఓ యువకుడికి పెళ్లయింది. పెద్దల సమక్షంలో అందమై యువతితో పెళ్లి జరిగింది. వివాహ వేదికపై డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెళ్లి కూతురు కూడా ఓ పాటకు స్టెప్పులేసింది. అయితే ఆ వధువు డ్యాన్స్ చేసిన పాటకు అర్థం వరుడికి కోపం తెప్పించేలా ఉంది. నేను చెప్పనట్టే వినాలి.. నీపై ఆధిపత్యం చెలాయిస్తా అంటూ ఆ పాట లిరిక్స్ ఉన్నాయి. 

అలాంటి పాటకు పెళ్లికూతూరు డ్యాన్స్ చేయడంతో పెళ్లికొడుకుకి, అతడి కుటుంబసభ్యులకు మండిపోయింది. ఈ పాట తమ మనోభావాలను దెబ్బతీసిందని వధువుతో గొడవపెట్టుకున్నారు. పెళ్లి వేదికపైనే వధువుకు విడాకులిచ్చాడు. ప్రస్తుతం ఈ విడాకులు చర్చనీయాంశంగా మారింది. ఈ విడాకులు దేశంలోనే అత్యంత వేగవంతమైన విడాకులట.. ఓ పాట కొత్తగా జీవితం ప్రారంభించాల్సిన జంటను విడదీసింది.. ఇలా జరగడం ఇది మొదటి సారి కాదు. జోర్డాన్ లోనూ ఓ వ్యక్తి పెల్లి వేడుకల్లో ఇదేపాటకు తన భార్యకు విడాకులు ఇచ్చాడు. 

Leave a Comment