ఏపీ హైకోర్టు తరలింపునకు బ్రేక్..

ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి మోకాలడ్డింది అమరావతి హైకోర్టు. తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై ఏపీ హైకోర్టు బుధవారం విచారించింది. హైకోర్టు తరలింపు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ, సీఆర్డీఏలలో నిర్మాణాల అభివృద్ధి, రాజధానిలో భూముల కేటాయింపుపై జారీ చేసిన 107 జీవోను సవాలు చేస్తూ వేసిన అన్ని పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగింది.సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులు, కమిటీలను ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరవు న్యాయవాది అశోక్ బాన్ హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు.

ఉమ్మడి హైకోర్టుని అప్పట్లో ఉన్న హైదరాబాద్ అఫ్జల్ గంజ్ ప్రధాన భవనం నుంచి గచ్చిబౌలి కి షిఫ్టింగ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2015లో తీర్పు చెబుతూ తెలంగాణ ప్రభుత్వానికి గానీ, శాసన సభకు గానీ అలా అడిగే హక్కు లేదని ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరపు న్యాయవాది అంబటి సుధాకర్, పొన్నెగంటి మల్లిఖార్జున రావు ప్రస్తావించారు.హైకోర్టుని షిఫ్ట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌లో సీనియర్ న్యాయవాది అంబటి సుధాకర్ వాదనలు వినిపించారు. దాంతో విచారణ కొనసాగించాలని నిర్ణయించిన హైకోర్టు ధర్మాసనం.. అమరావతిలో నిర్మాణంలో వున్న హైకోర్టు పనులను ఆపవద్దంటూ జగన్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు గురించి దాఖలైన పిటిషన్లను ఒక బ్యాచ్‌గా, కమిటీలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను మరో బ్యాచ్‌గా వాదనలు వినాలని త్రిసభ్య ధర్మసనం నిర్ణయించింది.

 

Leave a Comment