ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడు ఆత్మహత్య..!

ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరికొకరు విడిచిపెట్టలేనంతగా ఘాడంగా ప్రేమించారు. కాని అనారోగ్యం కారనంగా కొన్ని రోజుల క్రితం అమ్మాయి చనిపోయింది. తన ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో ప్రియురాలి సమాధి వద్దే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లిలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు కుదురుపల్లికి చెందిన మహేశ్ ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. అయితే ఆ యువతి అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం మరణించింది. అప్పటి నుంచి మహేశ్ తన ఆలోచనలతో గడుపుతున్నాడు. చివరికి ప్రియురాలి సమాధి వద్ద ఉరివేసుకుని మృతి చెందాడు. 

చనిపోయే ముందు ప్రియురాలి లేని లోకంలో ఉండలేనని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఆ స్టేటస్ చూసిన వెంటనే స్నేహితులు కుటుంబానికి సమాచారం ఇచ్చారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు వచ్చే సరికి మహేశ్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

 

Leave a Comment