అఘోరాగా బాలయ్య..

బోయపాటి- బాలక్రిష్ణ సినిమా షురూ..

నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘రూలర్’గా నిరాశ పరిచిన బాలయ్య ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసిగా ఉన్నాడు. తనకు రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ బోయపాటితో సినిమా తీసి హ్యాట్రిక్ సాధించాలని ఉన్నాడు. గతంలో బాలయ్య, బోయపాటితో కలిసి సింహా, లెజెండ్ సినిమాలు తెరకెక్కించగా ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. అయితే ప్రస్తుతం బోయపాటితో తీస్తున్న సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ మొదలు పెట్టారు. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. బాలయ్య ఫైట్ చేస్తున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ ను వారం పాటు చిత్రీకరించనున్నారు. దీనికి రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ తర్వాత అనంతపూర్ లో షూటింగ్ కొనసాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. ఒక గెటప్ లో స్టైలిష్ గా ఉంటే మరొక గెటప్ లో అఘోర లుక్ లో కనిపస్తాడు. శరవేగంగా ఎటువంటి బ్రేకులు లేకుండా చిత్రీకరణను పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. ఇక ఈ సినమాలో హీరోయిన్స్ గా అంజలి, శ్రియ నటించనున్నారు. 

Leave a Comment