‘అఖండ’గా రానున్న బాలయ్య.. టీజర్ విడుదల..!

దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న బిబి3 సినిమా నుంచి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది సినిమా యూనిట్.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బిబి3 సినిమా టైటిల్ ను ప్రకటించింది. ఈ సినిమాకు ‘అఖండ’ టైటిల్ ను ఫిక్స్ చేసింది. ఈ మేరకు టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ లో బాలయ్య స్వామిజీ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలిసింది. 

కాగా ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ కానుకగా మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..   

Leave a Comment