ఏపీ రాజధాని హైదరాబాదే : మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబు స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుంటారని, ప్రజల కోసం వారు దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీ అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతకు ఆవేశం ఎక్కువని అన్నారు. వారు క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకుంటారని బొత్స ఎద్దేవా చేశాారు. 

శాసనసభ చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుందని, రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా పనిచేయాలని బొత్స సత్యనారాయణ అన్నారు. పూనర్విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాదే అని బొత్స తెలిపారు. శివరామక్రిష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలని, కానీ చంద్రబాబు.. నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఆ ప్రకటన ఏదైనా పార్లమెంట్ కి పంపలేదన్నారు. కాబట్టి హైదరాబాదే 2024 వరకు మన రాజధాని అని అన్నారు. రాజధాని వ్యవహారంలో గత ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించలేదన్నారు. పరిపాలన సౌలభ్యంకోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నామని బొత్స తెలిపారు.  

   

Leave a Comment