కూతురు ప్రేమించిందని చరిత్రలో చూడని శిక్ష వేసిన తల్లి..!

158
Love

తమ కొడుకులు గానీ, కూతుళ్లు గానీ ప్రేమిస్తున్నామని చెబితే చాలా మంది తల్లిదండరులు ఒప్పుకోరు. దీంతో ఎన్నో ప్రేమ జంటు ఆత్మహత్య చేసుకుంటుంటాయి. ప్రస్తుత సమాజంలో ఇలాంటివి నేటికీ జరుతూనే ఉన్నాయి. ఇక కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వేరే పెళ్లిళ్లు చేయడం చేస్తుంటారు. కానీ ఓ తల్లి మాత్రం తన కన్న కూతురు ప్రేమలో పడిందని తెలిసి.. చరిత్రలో ఎన్నడూ చూడని శిక్షను విధించింది. ఈ ఘటన 19వ శతాబ్దంలో ఫ్రాన్స్ లో జరిగింది. 

blanche monnier

వివరాల మేరకు.. 1876లో ఫ్రాన్స్ లో మేడమ్ మోనియర్ కు కూతురు, కుమారుడు ఉన్నారు. ఆమె కూతురు బ్లాంచే మోనియర్ తల్లిదండ్రులకు తెలియకుండా ఓ యువకుడి ప్రేమలో పడింది. కొద్దిరోజుల తర్వాత తన ప్రేమ విషయాన్ని తల్లి మేడమ్ మోనియర్ కు చెప్పింది. ఈ విషయం తెలిసి తల్లి ఆగ్రహానికి గురైంది. తన కూతురుకు ఓ ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించింది. ఇంతలో తన కూడురు చేసినపనిని జీర్ణించుకోలేకపోయింది. 

ఈక్రమంలో తన కూతురును ఓ చికటి గదిలో గొలుసులతో కట్టేసి బంధించింది. అప్పటికి తన కూతురుకు 25 ఏళ్లు ఉన్నాయి. పని వాళ్ల సహాయంతో ఆహారాన్ని బెడ్ వద్దకు విసిరేవారు. గొలుసులతో కట్టేసి ఉండటంతో మల, మూత్ర విసర్జన కూడా అక్కడే చేయాల్సిన పరిస్థితి ఉండేది. భరించలేని వేదనతో అరుస్తూ, ఏడుస్తూ ఉండేది. బాధతో తిండి కూడా తినేది కాదు. అలా బతికుండగానే కూతురుకు నరకాన్ని చూపించింది ఆ తల్లి. అంతేకాదు ప్రతిరోజూ ఆమె అరుస్తుండటంతో.. తన కూతురికి పిచ్చి పట్టిందని ఇరుగుపొరుగు వారికి చెప్పుకొచ్చింది. అలా తన కూతురును 25 ఏళ్ల పాటు చీకటి గదిలో బంధీగా ఉంచింది. 

తర్వాత 1901 మే 23న పారిస్ అటార్నీ జనరల్ కు ఓ యువతి 25 ఏళ్లుగా చీకటి గదిలో బంధీగా ఉందని ఓ రహస్య లేక రాశారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి బంధీగా ఉన్న బ్లాంచే మోనియర్ ను రక్షించారు. తర్వాత తల్లిని, కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా చర్చనియాంశమైంది. కొన్ని ఏళ్లు బతికిన బ్లాంచే మోనియర్ 1913లో చనిపోయింది.    

Previous articleరోడ్డు ప్రమాదాల్లో మరణించిన సెలబ్రెటీలు వీరే..!
Next articleనటుడు ఉత్తేజ్ భార్య మృతి..చిరును పట్టుకుని రోదించిన ఉత్తేజ్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here