బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్..!

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లపై పోలీసులు దాడి చేసి, సోదాలు నిర్వహించారు. దీన్ని తెలుసుకున్న బండి సంజయ్ సిద్ధిపేట బయలు దేరారు. అయితే సిద్ధిపేటలో సంజయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసి సిద్దిపేట నుంచి కరీంనగర్ కి తీసుకెళ్లారు. 

కాగా రఘునందన్ రావు మామ గోపాల్ రావుతో పాటు బంధవుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. వారి వద్ద నుంచి రూ.18.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.  అయితే స్వాధీనం చేసుకున్న నగదును బీజేపీ కార్యకర్తలు బలవంతంగా లాక్కెళ్లారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా డబ్బులు లాక్కెళ్లిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగదు దొంగిలించిన వారిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిడ్ తెలిపారు.   

 

Leave a Comment