రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్..

ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో విడుదలయిన టీజర్ వివాదాస్పదమవుతోంది. ఈనెల 22న కొమురం భీం జయంతి సందర్భంగా చిత్రం యూనిట్ భీమ్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ రిలీస్ చేసింది. ఈ టీజర్ లో ముస్లిం గెటప్ లో ఉండటం వివాదాస్పదంగా మారింది. నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్ కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని పలు ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నారు. వెంటనే ఆ సీన్ తొలగించాలని డిమాండ్ చేశాయి. 

కాగా, దర్శకుడు రాజమౌళికి బీజేపీ ఎంపీ సోయం బాపురావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ పాత్ర ధరించిన టకియాను తొలగించాలని సూచించారు. ఒకవేళ అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమన్నారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యాడన్నారు. భీమ్ ను చంపిన వాళ్ల టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అన్నారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేకుంటే మర్యాద ఉండదని హెచ్చరించారు.  

Leave a Comment