బిగ్‌బాస్‌ సీజన్ 4 లో బిత్తిరి సత్తి..?

V6 న్యూస్ ఛానెల్ లో తీన్మార్ వార్తల ద్వారా అందిరికీ పరిచయమైన వ్యక్తి బిత్తరిసత్తి. తనదైన శైలి యాసలో విలక్షణమైన హావభావాలను పలికిస్తూ అలరిస్తాడు..ఆ తర్వాత టీవీ9లో చేరి ఇస్మార్ట్ వార్తలతో అలరించాడు. అయితే టీవీ9 యాజమాన్యం బిత్తరిసత్తిని తొలగించింది. 

కాగా బిత్తరిసత్తి త్వరలో బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వనున్నాడని తెలుస్తోంది. తెలుగులో ‘బిగ్ బాస్’ షో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సీజన్ 1  ని  నిర్వహించడంతో బిగ్ బాస్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరవాత నాని, నాగార్జున మిగిలిన రెండు సీజన్ లకు హోస్ట్ లుగా వ్యవహరించారు. 

ఇక త్వరలో బిగ్ బాస్  సీజన్ 4 మొదలు కానుందని తెలుస్తుంది. లాక్ డౌన్ కారణం గా బిగ్బాస్4 కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్ కు విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరిస్తారు అని టాక్ నడుస్తుంది. మరో వైపు వెంకటేష్ హోస్ట్ చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సీజన్ లో బిత్తిరి సత్తి హౌస్ లో సందడి చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది . మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నాదనేది తెలియాల్సి ఉంది.

 

Leave a Comment