అలాంటి వారితో జాగ్రత్త : జూనియర్ ఎన్టీఆర్

వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూచించారు. ప్రస్తుతం సొసైటీలో నేరాలు పెరిగిపోయాయి. కొందరు ఆన్ లైన్ పరిచయాల ద్వారా మోసపోతున్నారు. ప్రత్యేకంగా అమ్మాయిలకు సోషల్ మీడియా పరిచయాలు కష్టాల తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి వారిని అలెర్ట్ చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు తాజాగా సైబర్ క్రైంకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తో ఓ వీడియో రూపొందించారు. 

ఓ యువతికి ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి ద్వారా ఎదురైన చేదు అనుభవాన్ని కథాంశంగా ఓ షార్ట్ వీడియో చేశారు. ఈ వీడియో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఓ సందేశం ఇచ్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సమాచారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులతో ఆన్ లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చన్నారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైంకు రిపోర్టు చేయాలని సూచించారు. 

Leave a Comment