ఆవిరితో కరోనాకు మెరుగైన ఫలితాలు..!

మనకు ఏ చిన్న జలుబు చేసినా అమ్మమ్మలు, నాయన్నమ్మలు మనతో ఆవిరి పట్టించే వాళ్లు. అయితే ఆ ఆవిరి మంత్రమే ఇప్పుడు కరోనాను ఎదుర్కొనేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో ఆవిరి పడుతున్న వారు కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. 

సాధారణంగా జలుబు చేసినప్పుడు వేడి నీటితో ఆవిరి పడుతుంటారు. ఆ నీటిలో పసుపు, విక్స్, అమృతాంజన్ వేసి ఆవిరి పడతారు. ఆవిరి పట్టడం కరోనా చికిత్సలో అద్భుతంగా  పనిచేస్తుందని ముంబైలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రి వెల్లడించింది. తాము చేసిన పరిశోధనల్లో సత్ఫలితాలు వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. 

డాక్టర్ దిలీప్ పవార్ ఆధ్వర్యంలో మే, జూన్ నెలల్లో కరోనా సోకిన వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించి పరిశోధనలు నిర్వహించారు.  ఆవిరిపట్టడం వల్ల ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని పాజిటివ్ వ్యక్తులు ఏడు రోజుల్లో, లక్షణాలు ఉన్న వారు ఏడు నుంచి 10 రోజుల్లో కోలుకున్నట్లు వీరి అధ్యయనంలో వెల్లడైంది. 

  • సాధారణ, మధ్యస్థ లక్షణాలు ఉన్న వారు, వైరస్ సోకి ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. 
  • మొదటి గ్రూపులో ఉన్న వారు రోజుకు రెండు సార్లు 5 నిమిషాలపాటు ఆవిరిపట్టేలా చర్యలు తీసుకున్నారు. 
  • రెండో గ్రూపు వారు ప్రతి మూడు గంటలకు ఒకసారి 5 నిమిషాలపాటు ఆవిరిపట్టాలని సూచించారు. 
  • ఇలా 14 రోజుల నుంచి 2 నెలలపాటు పరిశీలిస్తే వీరిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. 
  • రెండు గ్రూపుల్లో ఉన్న వారిని పరిశీలిస్తే స్వల్ప లక్షణాలున్న వారు 7 రోజుల్లో కోలుకుంటే, మధ్యస్థ లక్షనాలున్న వారు 7 నుంచి 10 రోజుల్లో కోలుకున్నారు. 

ఆవిరిలో 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో భారం తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే 56-60 డిగ్రీల ఉష్ణోగ్రత తగలగానే వైరస్ చనిపోతుందని దిలీప్ పవార్ స్పష్టం చేశారు.  

 

Leave a Comment