కరోనాలో ఉద్యోగం కోల్పోయి కమర్షియల్ సెక్స్ వర్కర్ గా మారాడు.. గంటకు రూ.5 వేలు..!

కరోనా కాలంలో ఓ వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయాడు. తర్వాత ఏం చేయాలో తెలీక కమర్షియల్ సెక్స్ వర్కర్ గా మారాడు. గంటకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదించడం మొదలుపెట్టాడు. అయితే అతని ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. తర్వాత అతడిపై నిఘా పెట్టింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 

బెంగళూరులోని ఓ బీపీవో క్యాంటీన్ లో పనిచేస్తున్న ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. 2017 నుంచి వీరిద్దరు డేటింగ్ చేశారు. చివరికి 2019లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత సుబ్రహ్మణ్య నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే కరోనా కాలంలో ఆ వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడు. తర్వాత ఇతర అవకాశాల కోసం వెతికాడు. ఏదీ లభించలేదు. 

అయితే కొన్ని రోజులకు ఆ వ్యక్తి ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. భర్త ఎక్కువగా ల్యాప్ టాప్, ఫోన్లలో బిజీగా గడపటం కనిపించాడు. అది ఆమెలో మరింత అనుమానాన్ని పెంచింది. దీంతో ఎలాగైనా భర్త ల్యాప్ టాప్ ఓపెన్ చేసి చూడాలని అనుకుంది. తన సోదరుడి సాయంతో తన భర్త ల్యాప్ టాప్ ను ఓపెన్ చేసి చూసి షాక్ అయింది. 

ల్యాప్ టాప్ లో ఓ సీక్రెట్ ఫోల్డర్ లో తన భర్త న్యూడ్ ఫొటోలతో పాటు, తనకు తెలియని అమ్మాయిల సెమీ న్యూడ్ ఫొటోలు, సెల్ఫీలు ఉండటం గుర్తించింది. చివరకు తన భర్త కమర్షియల్ సెక్స్ వర్కర్ గా పనిచేస్తున్నట్లు తెలుసుకుంది. గంటకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తున్నాడని, అతనికి నగరంలో చాలా మంది క్లయింట్స్ ఉన్నారని తెలిసింది. 

ఈ విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె మల్లేశ్వరమ్ పోలీస్ స్టేషన్ లో మహిళల హెల్ప్ లైన్ ని ఆశ్రయించింది. తాను ఉద్యోగం కోల్పోవడంతో సెక్స్ వర్కర్ గా మారినట్లు విచారణతో ఆ వ్యక్తి అంగీకరించాడు. దీనిని తన క్లోజ్ ఫ్రెండ్ ఒకరు పరిచయం చేశారని వెల్లడించాడు. అయితే ఆ దంపతులిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో తాను చేస్తున్న పనిని వదిలిపెట్టి వివాహ బంధం కొనసాగిస్తానని ఆ వ్యక్తి తెలిపాడు. అయితే మహిళ మాత్రం తాను విడాకులు తీసుకుంటానని చెప్పింది. దీంతో విడాకుల కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. 

   

Leave a Comment