వినూత్న ప్రయత్నం.. ఊరినే స్కూల్ గా మార్చేసిన మాస్టర్..!

కరోనా లాక్ డౌన్ తో దేేశంలో గత ఏడాదిన్నరగా స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే తెరుచుకోగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఇంకా తెరుచుకోలేదు. దీని కారణంగా చాలా మంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. దీంతో పిల్లలను మళ్లీ స్కూల్స్ వైపు తీసుకురావాలనుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు.. అయితే తరగతి గదుల్లో పాఠాలు చెప్పలేడు. అక్కడున్న వారందరూ నిరుపేదల పిల్లలే.. అది ఒక మారుమూల ప్రాంతం కావడంతో ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లు లేవు. పిల్లలకు ఎలాగైనా పాఠాలు బోధించాలనుకున్నాడు. అందుకోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు. ఊరినే తరగతి గదిగా మార్చేశాడు. ఆ ఉపాధ్యాయుడే పశ్చిమ బెంగార్ కు చెందిన దీప్ నారాయణ్ నాయక్..

పశ్చిమ బెంగాల్ బర్ధమాన్ జిల్లాలోని జోబా అనే మారుమూల గిరిజన గ్రామంలో నాయక్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నాయక్ ఆ ఊర్లోని వీధి గోడలన్నింటినీ బ్లాక్ బోర్డులుగా మార్చాడు. వివిధ సబ్జెక్టుల పాఠాలు వాటిపై రాసి, పిల్లలను రోడ్డు పక్కన దూరదూరంగా కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నాడు. కరోనా నిబంధనలు పాటిస్తూ వారికి మాస్కులు ఇచ్చి శానిటైజర్ తో చేతులు శుభ్రం చేయిస్తున్నాడు. దీంతో ఆ ఊర్లో పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఊరినే బడిగా మార్చేసిన నాయక్ ని అందరూ ‘రాస్తర్ మాస్టర్’ అని పిలుచుకుంటున్నారు. 

 

Leave a Comment