కరోనాను చంపే మాస్క్.. 12వ తరగతి విద్యార్థిని ఆవిష్కరణ..!

కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరి అంటూ ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేశాయి. అయితే ఇప్పటి వరకు మాస్క్ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం.. తాజాగా కరోనాను చంపే మాస్క్ ను పశ్చిమ బెంగాల్ కు చెందిన 12వ తరగతి అమ్మాయి అభివృద్ధి చేసింది. ఈ మాస్క్ కరోనాను చంపేస్తుందని విద్యార్థిని పేర్కొంది. 

పశ్చిమ బెంగాల్ పుర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన దిగ్నాటిక బోస్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కరోనా వైరస్ కట్టడికి దిగ్నాటికకు ఓ ఆలోచన వచ్చింది. ఈక్రమంలో ఓ విభిన్నమైన మాస్క్ ను తయారు చేసింది. ఈ మాస్క్ కరోనా వైరస్ ను చంపేస్తుందని దిగ్నాటిక తెలిపింది. ఈ మాస్క్ న ముంబైలోని గూగుల్స్ మ్యూజియం ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ లో ప్రదర్శించారు. 

ఈ మాస్క్ లో మూడు చాంబర్లు ఉంటాయని, మొదటి చాంబర్ లో ఉండే అయాన్ జనరేటర్ గాలిలోని దమ్ము కణాలను వడబోస్తుందని దిగ్నాటిక తెలిపింది. ఇలా ఫిల్టర్ అయిన గాలి సెకండ్ చాంబర్ గుండా మూడో దానిలోకి ప్రవేశిస్తుందని చెప్పింది. కెమికల్ చాంబర్ గా పిలిచే దీనిలో సబ్బు కలిపిన నీరు ఉంటుందని తెలిపింది. ఫిల్టర్ అయ్యి వచ్చిన గాలిలో ఉండే కరోనా వైరస్ ను ఈ సబ్బు నీరు చంపేస్తుందని దిగ్నాటిక పేర్కొంది. 

అంతే కాదు కోవిడ్ పేషెంట్లు ఈ మాస్క్ ను వినియోగిస్తే పైన చెప్పిన ప్రాసెస్ రివర్స్ లో జరుగుతుందని దిగ్నాటిక తెలిపింది. దీంతో వారు వదిలిన గాలిలో కరోనా వైరస్ ఉంటుందని, థర్డ్ చాంబర్ లోని సబ్బు నీటిలోకి ప్రవేశించినప్పుడు అది చనిపోతుందని పేర్కొంది. ఆ తర్వాత వైరస్ రహిత గాలి మిగతా రెండు చాంబర్ల గుండా బయటకు వస్తుందని, దీని వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపింది. ట్రయల్స్ నిర్వహించడం కోసం త్వరలోనే రాష్ట్ర వైద్య శాఖ అధికారులను కలుస్తానని దిగ్నాటిక చెప్పుకొచ్చింది. కాగా ఇలాంటి ఆవిష్కరణలు చేయడం ద్వారా దిగ్నాటిక ఇప్పటికే మూడు సార్లు ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డ్ అందుకుంది…

Leave a Comment